RSS
email

అవతార్ సినిమా , Avatar Movie Review


నటీనటులు: శామ్ వర్థింగ్టన్, సిగోర్నీ వీవర్, జోయి సల్దానా,
టెక్నీషియన్స్: ఫుజున్ డిజిటల్ 3-డి, 
కెమేరా: విన్స్ పేస్, కామెరాన్, 
విజువల్ ఎఫెక్ట్స్: వేటా విజువల్స్, 
నిర్మాణ సంస్థ: 20 ఫ్యాక్స్ సెంచుర

టెర్మినేటర్, టైటానిక్ చిత్రాలు చూసినవారు ఆంగ్ల చిత్రాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఆ చిత్రాల దర్శకుడు జేమ్స్ కేమరూన్ స్వప్నమే "అవతార్". సైన్స్- ఫిక్షన్ తరహా కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. కాకపోతే అక్కడ రాత్రి కాబట్టి ఇండియాలో ముందుగా విడుదల కావడం విశేషం. హైదరాబాదులో ఐమాక్స్ 3డి ఫార్మెట్‌లోనూ, 2డి ఫార్మెట్‌లోనూ విడుదలైంది. 

అవతార్ సినిమా ట్రైలర్ ని విక్షించండి





కథ: "అవతార్" ఆంగ్ల చిత్రమైనప్పటికీ భారతీయ సంస్కృతి కనిపిస్తుంది. రామాయణంలో వానరాలున్నట్లే, ఇందులో ఓ గ్రహంలో వానరాన్ని పోలిన మనుషులుంటారు. మాజీ మిలట్రీ అధికారి జాక్ (శామ్ వర్దింగ్టన్) ప్రమాదవశాత్తూ నడుము భాగంలో స్పర్శను కోల్పోతాడు. మామూలు స్థితికి రావాలంటే అవతార్ అనే కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సి వస్తుంది. ఆ దశలో అతను వేరే గ్రహానికి వెళ్లాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే అక్కడ ఉండే వానరాల్లాంటి వాసుల (అవతార్స్) ప్రదేశమంతా భయంకరమైన అటవీ ప్రాంతం. తేలియాడే కొండలు, భయంకరమైన చెట్లు, జలపాతాలుంటాయి.

అక్కడ వందలాదిమంది జీవిస్తుంటారు. అక్కడికి వెళ్లాలంటే మామూలు మానవరూపంలో వెళితే వాళ్లు చంపేస్తారు. అందుకని చనిపోయిన అవతార్‌లాంటి వానర రూపాన్ని తీసుకవచ్చి కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా జాక్ ఫీలింగ్స్‌ను అంటే... ప్రాణాన్ని అందులో స్థిరీకరించడం చేస్తారు. జాక్ ఒక మిషన్‌లో ఉంటాడు. అక్కడ జాక్ ప్రాణం అవతార్‌లోకి వెళ్లిపోతుంది. దాంతో అడవిలో అవతార్ ఏమి చేస్తున్నా తెలిసిపోతుంది.

జాక్ అవతార్స్‌లాగా ప్రవర్తిస్తాడు. ఇతనికి డాక్టర్ గ్రేస్( సిగోర్నీ) కూడా సహకరించి ఆమె కూడా ఆడ అవతార్ రూపంలోకి ప్రవేశిస్తుంది. (ఇదంతా వింటుంటే వింతగా ఉందా... ఇది జరిగేది 2154 సంవత్సరంలో... ఆ ఏడాది 3వ నెల నుంచి 8వ నెల వరకూ జరిగిన కథాగమనమే ఈ సినిమా) అవతార్ రూపంలో ఉన్న వీరిని ఆ అటవీ ప్రాంతంలో వదిలి రావడానికి కొంతమంది మిలటరీ అధికారులు కూడా వెళతారు. కానీ అక్కడ ఎగిరే ఖడ్గమృగాల ధాటికి పారిపోతారు. ఒక్క జాక్ మాత్రమే మిగులుతాడు. ఆ ఖడ్గమృగాల నుంచి ఆ దట్టమైన అడవిలో పారిపోతూ ఎత్తైన జలపాతంలో పడిపోతాడు.

జలపాతంలో ఒడ్డుకు రాగానే అడవి నక్కలు వెంటపడతాయి. వాటిని కూడా ఎదిరించే క్రమంలో హఠాత్తుగా లేడీ అవతార్ వచ్చి కాపాడుతుంది. ఆక్కడ నుంచి ఆమె తమ స్థావరానికి తీసుకవెళుతుంది. ఈ వానరాలకు పెద్దయిన ఆమె తల్లి, తండ్రి జాక్ అవతార్ రూపంలో ఉన్నా తమలో కలుపుకునేందుకు అంగీకరిస్తారు. కొన్ని పరీక్షలు పెడతారు. ఆ తర్వాత లేడీ అవతార్ సహకారంతో వారి అలవాట్లను నేర్చుకుంటాడు. ఆ క్రమంలో జాక్... అంటే అవతార్ ఆ అడవిలో ఉన్న విలువైన ఔషధ సంపదను, ఖనిజ సంపద ఎక్కడున్నాయో తెలియజేస్తే ఆపరేషన్ అధికారులు వచ్చి వాటిని స్వాధీనం చేసుకునేందుకు సమాయాత్తమవుతారు. ఆ ఔషధాల విలువ మిలియన్ డాలర్లు. అవి మానవాళికి ఎంతో ఉపయోగపడతాయి.

కానీ జాక్‌కి అడవి మనుషుల ప్రేమానురాగాలు, ఆప్యాయతానురాగాలు కట్టడి చేస్తాయి. చివరికి ఆపరేషన్ చేయడానికి బాంబులతో కూడిన విమానాలు, రోబోట్స్‌తో మిలట్రీ అధికారి అవతార్స్ స్థావరాలపై దాడి చేస్తాడు. ఇదంతా తెలుసుకున్న జాక్ అవతార్ ఏం చేశాడు? మరి జాక్ అవతార్ అడవి మనుషులను కాపాడాడా? లేదా తనకు అప్పచెప్పిన ఔషధాలను అధికారులకు ఇచ్చాడా...? అనేది సినిమా.

శామ్ వర్దింగ్టన్, సిగోర్నీ వీవర్, జూయీ సల్దాన్ ప్రధానపాత్రలతోపాటు ప్రతి నటుడు తమతమ పాత్రలలో జీవించారనే చెప్పాలి. అంతా నిజంగానే జరుగుతున్నట్లే ఉంటుంది. అడవిలో ఉండే సెలయేర్లు, వేలాడే కొండలు, పొడవాటి చెట్లు, గుహలు, లోయలు, డైనోసార్ లాంటి ఎగిరే పక్షులు చూసే ప్రేక్షకుడికి థ్రిల్ కలిగిస్తాయి. ఈ చిత్రాన్ని 2400 కోట్ల రూపాయలతో ట్వింటియత్ సెంచురీ ఫాక్స్ సంస్థ నిర్మించింది. ఇది జేమ్స్ కేమరూన్‌కు డ్రీమ్ ప్రాజెక్ట్. మనుషుల్ని మమూలుగా అవతార్స్‌ను చాలా పెద్దవారిగా చూపించే ప్రక్రియ థ్రిల్ కలుగజేస్తుంది. మానవుని మేధస్సుకు తార్కాణం ఈ అవతార్.

ముఖ్యంగా చిత్రానికి ప్రాణం గ్రాఫిక్ వర్క్. యాక్షన్ అంశాలకు పెద్దపీట వేశారు. చిత్ర నిడివి రెండున్నర గంటలు. బయటకు వచ్చేవరకూ అంత సమయం సినిమా చూశామా అని కూడా అనిపించదు. ఇంటర్వెల్ పెడితే మధ్యలో 3డిలో చూసే ఫీల్ మిస్ అవుతారని ఐమాక్స్ 3డి ప్రతినిధి రమేష్ ప్రసాద్ చెప్పారు. 40వేల ప్రాసెసర్ల సాయంతో విజువల్ ఎఫెక్ట్స్‌ని రూపొందించారు. మన దేశంలోనే 700 ప్రింట్లతో ఇది విడుదలైంది. తప్పకుండా ప్రతివారూ చూడదగ్గ చిత్రం ఇది.

Bookmark and Share

0 comments:

Related Posts with Thumbnails

AddThis

Share |