

జేమ్స్‌బాండ్ సిరీస్‌లో కొత్తగా వస్తున్న క్వాంటమ్ ఆఫ్ సొలెస్ జేమ్స్‌బాండ్- 2008 చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్క్‌పోస్టర్ ఈ సినిమా దర్శకుడు. ఇటలీ, పిలి, పనామా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, రష్యా తదితర దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని అత్యధిక ప్రింట్లతో భారత్‌లో విడుదల చేస్తున్నారు.
సినిమాను దక్షిణాది రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న విజయ సినీ ఎంటర్‌ప్రైజెస్ అధినేత ఎం.శ్రీధరన్ మాట్లాడుతూ.. మొత్తం 300 ప్రింట్లతో సినిమాను విడుదల చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే 150 ప్రింట్లతో సినిమాను ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్టు చెప్పారు.
అమెరికాలో ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతుండగా, వారం రోజుల ముందుగా భారత్‌లో విడుదలవుతుండటం గమనార్హం. పైరసీను నియంత్రించడం కోసమే ఇండియాలో దీనిని ముందుగా విడుదల చేస్తున్నట్టు శ్రీధరన్ వెల్లడించారు. సాధారణంగా జేమ్స్‌బాండ్ చిత్రాల్లో ఉండే ఫైట్‌లు, ఛేజ్‌లు ఈ సినిమాలోనూ ఉంటాయి.
ప్రపంచాన్ని అత్యధిక ఉష్టోగ్రతో నాశనం చేసిన అనంతరం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి, దానికి నాయకుడు అవ్వాలనే విలన్ ఫార్ములాను హీరో ఎదుర్కోడవమే ఈ సినిమా కథాంశం. యాక్షన్ సన్నివేశాల్లో హీరో డానియల్ క్రెగ్, హీరోయిన్ ఓల్గా కురివెంకో అద్భుతంగా నటించారు. బాండ్ సిరీస్‌లో వస్తున్న 28వ చిత్రమిది.
0 comments:
Post a Comment