
రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా తెరపైకి వచ్చిన హీరో ప్రభాస్. తనదైన శైలిలో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాడు. చేసింది తక్కువ చిత్రాలు అయినప్పటికీ, ప్రేక్షకుల మదిలో మాస్ హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నాడు.
అయితే ఇటీవల కాలంలో సరైన హిట్ పలకరించకపోవడంతో, ప్రభాస్ ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. గురువారం పుట్టినరోజు జరుపుకున్న ప్రభాస్ ప్రస్తుతం తమిళంలో ఘన విజయం సాధించిన "బిల్లా" తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు.
సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్ బేనర్‌పై "బిల్లా" చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌తోపాటు రెబల్‌స్టార్ కృష్ణంరాజు కూడా నటిస్తుండటం గమనార్హం. "కంత్రి" సినిమా దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయదశమినాడు సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.
0 comments:
Post a Comment